బాలికల అక్రమ రవాణా గుర్తింపు..! 1 d ago
AP:విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. కిరండోల్-విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికల అక్రమ రవాణాను పోలీసులు గుర్తించారు. 11 మందిని రైల్వే పోలీసులు రెస్క్యూ చేసారు. నిందితుడు రవికుమార్ బిసోయ్ ని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నేపాల్లోని..మారుమూల ప్రాంతాల నుంచి బాలికలను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇప్పటి వరకు నిందితులు 100 మందికి పైగా బాలికలను..అక్రమ రవాణా చేసారు.